Entertainment బాలీవుడ్ స్టార్ హీరో లవర్ బాయ్ డ్రీమ్ బాయ్ రన్బీర్ కపూర్ తాజాగా ఓ సంచల నిర్ణయం తీసుకున్నారు దీంతో ఆయన అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు..
బాలీవుడ్లో ఇప్పటికీ మోస్ట్ రొమాంటిక్ హీరోగా పేరున్న హీరో రణ్బీర్ కపూర్ ఈ ఏడాది బాలీవుడ్ నటి ఆలియా భట్ను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే అయినప్పటికీ ఏమాత్రం తగ్గలేదు ముఖ్యంగా ఈయన చేసిన రొమాంటిక్ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అలాగే ఈయనకు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే అయితే తాజాగా ఈయన ఇకమీదట రొమాంటిక్ సినిమాలను తీయను అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసాడు దీంతో ఆయన అభిమానులంతా షాక్కు గురయ్యారు..
తాజాగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణ్‌బీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక నుంచి మాట్లాడుతూ.. తాను ఇక నుంచీ రొమాంటిక్ కామెడీ మూవీస్ చేయనని ప్రకటించారు. .. అయితే ఇది ఎలా ఉన్నావ్ ఆయన నిర్ణయం తీసుకోవడం వెనక అసలు కారణం ఏంటో కూడా చెప్పుకొచ్చాడు.. రొమాంటిక్ మూవీ చేసీ చేసీ తాను విసుగు చెందానని, అందుకే ఈ తరహా సినిమాలు చేయదల్చుకోవడం లేదు అని ప్రకటించారు యంగ్ హీరో. ఇప్పుడు మారిన ట్రెండ్‌కు, తనకున్న ఇమేజ్‌కు లవ్‌స్టోరీస్ సెట్ కావని ఆయన అన్నారు. ఆయన ఈ రకంగా ప్రకటన చేశారు. ప్రస్తుతం తాను లవ్ రంజన్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్నానని. ఇక ఇదే నా చివరి రొమాంటిక్ కామెడీ మూవీ అని ప్రకటించారు