రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ లో నిర్వహించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘యానిమల్’ కు మీరు ఇంతగా ఆదరణ చూపిస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ట్రైలర్ చూశా.. మెంటలొచ్చేసింది. ఇంత ఒరిజినల్ ట్రైలర్ నేను ఇప్పటివరకూ చూడలేదు. నేను ఎప్పుడూ ఇలా చెప్పను. మనస్పూర్తిగా ఫీలైతేనే చెబుతాను. సందీప్ ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించగానే రావాలనిపించింది. సందీప్ అంటే నాకు ఇష్టం. తను చాలా యునిక్, ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిందని విన్నా. ఇది ప్రీ రీలిజ్ ఈవెంట్ లా లేదు. వందరోజుల వేడుకలా వుంది. ట్రైలర్‌లోని అనిల్ కపూర్ గారి నటన చూసిగూస్ బంప్స్ వచ్చాయి. బాబీ దేవోల్ యాక్టింగ్ స్టన్నింగ్ గా వుంది.
రష్మిక అన్ని భాషల్లో నటిస్తోంది. ట్రైలర్ లో అద్భుతంగా వుంది. తన ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా వుంది. రణ్‌బీర్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఈ విషయం ఎప్పుడో చెప్పా గానీ ఆయన సీరియస్ గా తీసుకోలేదు. అందుకే ఈ వేదికపై మరోసారి చెబుతున్నా. నేను తన అభిమానిని, రణ్‌బీర్ ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ అని నా అభిప్రాయం. యానిమల్ ఇప్పటివరకూ తన బెస్ట్ వర్క్ అని నా భావన. ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డిసెంబర్ 1న యానిమల్ విడుదలౌతుంది. తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. యానిమల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందరినీ ధన్యవాదాలు’’ తెలిపారు.