అద్భుతం!💐 అమితానందం, అనిర్వచనీయమైన అనుభూతి “ఆగదమౌ జలనిధిలో ఆణిముత్యమున్నట్లు” అనితర సాధనతో, అంకుఠిత దీక్షతో…. అనునిత్యం అవ్యాజమైన ప్రేమతో చేసిన శ్రమకు గౌరవం దక్కడం, కఠోర సాధన ద్వారా వచ్చే ఫలితం అమృతం వలె వుంటుందంటారు… నిజంగా శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ ఆగమ వాస్తు శిల్ప కళాశాల విద్యార్థులకు ఇంతుకుముందేందరో స్ఫూర్తిని కలిగించినా, ఈ శతాబ్దపు సహస్రాబ్ది సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర ప్రధాన స్థపతిగా, శ్రీ రామానుజ సహస్రాబ్ది సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర ప్రధాన స్థపతి శ్రీమాన్ డి యన్ వి ప్రసాద్ స్థపతి కి అరుదైన గౌరవం!, తన మిత్రులందరూ ఉప స్థపతులుగా ఇంకా కళాశాల అనుభవజ్ఞులతో వీరు ఆవిష్కరించిన అద్భుతానికి మనసా వాచా కర్మణా అభినందనలు🙏.‘సాధనాత్ సాధ్యతే సర్వం’ అన్నట్లు మరెన్నో బృహత్తర కార్యక్రమాలకు తిరుపతి శిల్ప కళాశాల ప్రేరణకావాలని, మన రెండు తెలుగు రాష్ట్రాల స్థపతులు దేదీప్యమానంగా వెలుగొందాలని స్థపతుల మనుగడకు ఆధారమైన మన తిరుమల శ్రీనివాసుని కృపాకటాక్ష వీక్షణాలు అనునిత్యం కార్యసాధకులయిన మీపై ఉండాలని మరొక్కసారి ప్రసాద్ స్థపతి బృందానికి అభినందనలతో💐🙏……. స్థాపత్య కళా పరిషత్ కార్యనిర్వాహక సభ్యులు💐🙏