Rashmika Mandanna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి “చలో” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది.ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో క్యూటెస్ట్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. కాగా ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోలింగ్ తనని, తనతో సంబంధం ఉన్న వ్యక్తులను చాలా బాధిస్తున్నాయి అంటూ విచారం వ్యక్తం చేసింది రష్మిక . ఆ పోస్ట్ లో… “సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని విషయాలు నన్ను ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వాటి గురించి ఇవాళ మాట్లాడాల్సినా అవసరం ఉంది. నేను నా కెరీర్ మొదలుపెట్టినప్పుడు నుంచి ఇప్పటి వరకు ట్రోలింగ్ గురవుతూనే వస్తున్నా. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో నేను చెప్పిన కొన్ని విషయాలు నాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. వాటివల్ల ఇండస్ట్రీలో మరియు నా సన్నిహితుల మధ్య నాకున్న సంబంధాలు దెబ్బతింటున్నాయి.
నేను ఎంచుకున్న జీవితంలో నన్ను ప్రతి ఒక్కరు ఇష్టపడాలనే రూల్ ఏమి లేదు, కానీ ఎదుటివారి లైఫ్ ని మీ న్యూస్ ఐటమ్ కోసం వాడుకోవడం తప్పు అంటున్న. సినిమాలో నటించి మిమ్మల్ని ఆనందపరచడానికి నా వంతు కృషి నేను చేస్తా, ఏమైనా తప్పులు ఉంటే నిర్మాణాత్మక విమర్శలు చేయండి. అవి నా నటనను మెరుగుపరుచుకోడానికి ఉపయోగపడుతాయి. కానీ ఇలా ద్వేషం చూపిస్తూ నెగటివిటి క్రియేట్ చేస్తుంటే మనసుకి ఎంతో బాధ కలిగిస్తుంది” అంటూ వ్యాఖ్యానించింది.