Entertainment సీనియర్ హీరో రవితేజ శ్రీ లీల జంటగా నటించిన చిత్రం ధమాకా ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వచ్చాయి అంటే..
రవితేజ శ్రీ లీల జంటగా నటించిన చిత్రం ధమాకా ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు అయితే మాస్ యాక్షన్ ఈ సినిమా తొలి రోజు మిశ్రమ స్పందనను తెచ్చుకుంది… అయితే ఎవరూ ఊహించని విధంగా అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఎన్ని కలెక్షన్స్ వసూలు చేసిందో దానికి సంబంధించిన పోస్టర్ను ధమకా రిలీజ్ చేసింది..
ధమాకా మూవీకి తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లు గ్రాస్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈరోజు పోస్టర్‌ని రిలీజ్ చేసింది. అలాగే నైజాంలో రూ.2.10 కోట్లు రాబట్టిన ధమాకా.. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా రూ.7.60 కోట్లు వసూలు చేసింది. అలానే కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో రూ.45 లక్షలు వసూళ్లు చేయగా.. ఓవర్సీస్‌తో కలుపుకుని వరల్డ్‌వైడ్ మొత్తం రూ.10 కోట్ల వరకూ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ రూ.19 కోట్లు అని తెలుస్తోంది. ఓవరాల్‌గా రవితేజ కెరీర్‌లో తొలిరోజు అత్యధికంగా గ్రాస్ రాబట్టిన మూవీగా ధమాకా నిలిచింది. థియేటర్లలో ప్రస్తుతం అవతార్-2, 18 పేజీస్ సినిమాలు మాత్రమే పోటీగా ఉండటంతో పాటు.. క్రిస్మస్ సెలవులు, వీకెండ్ ఈ ధమాకా మూవీకి కలిసిరానుంది.
అయితే రవితేజ చివరగా నటించిన ‘ఖిలాడీ’, ‘రామారావు అన్ డ్యూటీ’ తేలిపోగా.. ఈ ధమాకా మూవీపై మాస్ మహరాజా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ‘సినిమా చూపిస్తా మావ’ ‘నేను లోకల్’ సినిమాలతో వెలుగులోకి వచ్చిన త్రినాధ రావు ఈ ‘ధమాకా’ మూవీని మాస్ ప్రేక్షకులకి నచ్చేలా తెరకెక్కించారు.