రాచకొండ కమిషనరేట్ లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ హోదాలో విధులు నిర్వహించి రిటైర్ అయిన శ్రీ పెరుమాళ్ల ప్రదీప్ కుమార్ జాతీయ స్థాయిలో బంగారు పథకాన్ని సాధించారు. ఈ నెల 13.09.2024 నుండి 16.09.2024 హర్యానాలోని సోనిపట్ సిటీలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో 83 కిలోల వెయిట్ క్యాటగిరీలో మొత్తం 390 కిలోల బరువును ఎత్తి మాస్టర్స్ – 3 కేటగిరీలో ప్రథమ స్థానంతో పాటు బంగారు పతకం కైవసం చేసుకున్నారు.
ఈ సందర్బంగా రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ. జి. సుధీర్ బాబు (I.P.S) గారు ప్రదీప్ కుమార్ ను అభినందించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరిన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్టుమెంటుతో పాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మంత్రి వ్యాఖ్యలను నేను సమర్ధించ లేదు… వక్రీకరించి హెడ్డింగ్ పెట్టారు : నిర్మాత నట్టి కుమార్