Entertainment దర్శకుడు ధీరుడు రాజమౌళి మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. ఈ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం విదేశాల్లో సత్తా చాటబోతుంది ఆర్ఆర్ఆర్..
ఆర్ఆర్ఆర్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే అలాగే వసూళ్లను కూడా అంతే స్థాయిలో రాబట్టింది ప్రస్తుతం ఈ చిత్రంలో ప్రభంజనం సృష్టించడానికి రెడీ అవుతుంది.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం జపాన్ వెళ్ళిన సంగతి తెలిసిందే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అలాగే జపనీయులు మన సౌత్ ఇండియా సినిమాలను చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు అలాగే అక్కడ రామ్ చరణ్ ఎన్టీఆర్ లకు మంచి అభిమానులు ఉన్నారు.. అలాగే మన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా జపాన్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆయన తర్వాత అంతే స్థాయిలో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆ స్థాయి అభిమానులను సంపాదించుకోవడం నిజంగా విశేషమనే చెప్పాలి.. నటించిన చిత్రాలు అక్కడ విడుదలవుతూ ఉంటాయి.. ఇప్పుడు అక్కడికి వెళ్లిన రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జపనీయులు ఘన స్వాగతం పలికారు.. అలాగే జపాన్ విద్యార్థులు వారి పెంపుడు జంతువు రైమ్ ను పోలిన కొన్ని బొమ్మలను వీరికి బహుమతులుగా ఇచ్చారు. ఆ విద్యార్థులతో రాంచరణ్ దంపతులకు సెల్పీలుగా దిగడంతోపాటు చాలాసేపు అక్కడే గడిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..