Malavika Mohanan : మాస్టర్ బ్యూటీ ” మాళవిక మోహనన్ ” గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. మాళవిక మోహనన్ మూవీ ఇండస్ట్రీలోకి వచ్చి 8 సంవత్సరాలు అయినప్పటికి… ఐదు చిత్రాల్లో మాత్రమే నటించింది. 2019 లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ” పేట ” మూవీలో నటించినా ఆమెకు అనుకున్నంతా స్థాయిలో గుర్తింపు రాలేదనే చెప్పాలి.
అలానే కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఫాలోయింగ్ ను ఓ రేంజ్ లో పెంచుకుందని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు కుర్రకారంతా ఫిదా అవుతున్నారు.
మాళవిక కుటుంబం విషయానికి వస్తే మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె అయిన మాళవిక ముంబైలో జన్మించారు. ఆమె కుటుంబం కేరళకు చెందినదే అయినా ఆమె ముంబైలో సెటిల్ అయిన తన తల్లిదండ్రులకు జన్మించింది. తండ్రి స్వయానా డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కావడంతో ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన ఆమె తరువాత చదువుకోకుండా తన తండ్రి తో పాటు సినిమాటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకుంది. మమ్ముట్టి చేస్తున్న ఒక ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ కోసం ఆమె కూడా తండ్రితో పాటు పని చేసింది.
ఇక ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ అమ్మడు అవకాశం కొట్టేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో మాళవికను ఒకే చేసినట్లు సమాచారం అందుతుంది. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో…