Gossip News: తారక్ సమంత జోడి అంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తారు అభిమానులు. ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ వంటి చిత్రాలలో బిజీ అయిపోయారు ఈ అమ్మడు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం “ఎన్టీఆర్ 30” ఈ చిత్రంలో మొదటిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో రూమర్ లు వినిపించాయి. దీనిపై స్పందించిన జాన్వికపూర్ ఈ సినిమా తను చేయడం లేదని చెప్పకనే చెప్పుకొచ్చారు ఈ అమ్మడు.
అయితే ఈ చిత్రంలో ఈ తారక్ సరసన సమంత ఎంపిక చేశారట కొరటాల. అందుకొరకు సమంతా ని సంప్రదిస్తే ఈ సినిమా చేయనని సమంత చేయనని చెప్పిందట దీంతో అభిమానులు సమంతపై ఫైర్ అవుతున్నారు.కొరటాల ఈ సినిమా కోసం హీరోయిన్‌కి రూ. 2.5 కోట్ల ఫిక్స్ చేశారట. అయితే సామ్ మాత్రం రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందని సోషల్ మీడియా వార్తల సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ వార్తపై చిత్ర బృందం కానీ సమంత గాని స్పందించలేదు.
ప్రస్తుతం యశోద, శాకుంతలం వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు నటించింది సమంత ఈ చిత్రాల త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇకపోతే హాలీవుడ్ లో అరేంజ్‌మెంట్స్ ఆప్ లవ్ అనే చిత్రంతో అడుగుపెట్టబోతుంది సామ్. కాగా హిందీలో షాహిద్ కపూర్ తో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ షో అయిన కరణ్ విత్ కాఫీలో సామ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయినానే చెప్పుకోవాలి.