Entertainment టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే అయితే ఆయన ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వారిని అందరికీ తెలుసు అయితే ఆ నవ్వు వెనక చెప్పుకోలేని ఎన్నో బాధలు ఉన్నాయని ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని కొంతమందికి మాత్రమే తెలుసు..
చలపతిరావు తన జీవితంలో ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు.. కన్నీటిని దిగమింగుకుంటూ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించేవారు.. ముఖ్యంగా ఆయన ఒకానొక సమయంలో జీవితంలో ఎదురైన బాధలతో ఆత్మహత్య కూడా చేసుకోవాలి అని అనుకున్నారు అనే సంగతి ఎవరికీ తెలియదు..
మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ చలపతిరావు దాన్ని బయటకు కనపడనీయరని చెబుతారు. ఈయన సతీమణి పేరు ఇందుమతి. వీరికి ఓ కొడుకు.. ఇద్దరు కుమార్తెలు. చెన్నైలో ఓ రోజు ఇందుమతి చీరకు నిప్పు అంటుకొని ఆమె తీవ్రంగా గాయపడ్డారు ఈ సమయంలో ఎంతగా ప్రయత్నించినా మూడు రోజుల తర్వాత మరణించారు అయితే ఈ బాధ అతనిని ఎంతగానో కలిసి వేసింది తర్వాత ఎందరో చెప్పిన అతను వరకు పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసమే ఉండిపోయారు.. అలాగే తర్వత కొన్నాళ్లకు ఆయన కు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దాదాపు తొమ్మిది నెలల పాటు చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు.. మరో సందర్భంలో మహిళలను ఉద్దేశించి ఓ ప్రెస్ మీట్‌లో చలపతి రావు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దాంతో ఆయనకు చాలా బాధ కలిగి సూసైడ్ చేసుకుని చనిపోవాలని కూడా అనుకున్నారట.