Entertainment బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అయితే అప్పటికప్పుడు అభిమానులు ఇతను పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉండగా తాజాగా ఒక అభిమానించే పని మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
సల్మాన్ ఖాన్ కు దేశమంతా ఎందరో అభిమానులు ఉన్నారు.. ఇప్పటికే ఇతని అభిమానులు అందరూ సల్మాన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు ఎన్నో పనులు చేస్తూ అతని మనసుని గెలుచుకుంటూ వస్తున్నారు అయితే తాజాగా.. సమీర్ అనే యువకుడు ఏకంగా 1,100 కిలోమీటర్లు సైకిల్ తొక్కి తన అభిమాన సల్లూ భాయ్‌ను కలిశాడు..
సమీర్ డిసెంబర్ 27న సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా జబల్పుర్ నుంచి ఈ సైకిల్ యాత్రను మొదలు పెట్టాడు. ఏడు రోజుల పాటు సైకిల్‌పై ప్రయాణించి ముంబయికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ సల్మాన్ సమీర్‌ను కలిసేందుకు ఒప్పుకున్నాడు. అలాగే అతని కలిసి కాసేపు ముచ్చటించారు అలాగే తనకోసం ఎంత అభిమానం చూపించిన అభిమానితో ఎంతో ప్రేమగా సెల్ఫీలు సైతం దిగారు.. ప్రస్తుతం వీటిని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇవి వైరల్ గా మారాయి.. అయితే ఎలా సమీర్ సల్మాన్ ఖాన్ను కలవడానికి సైకిల్ మీద రావడం ఇది మొదటిసారి కాదు 2019లో ఒకసారి ఇలాగే 600 కిలోమీటర్లు పైగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చి సల్మాన్ ఖాన్ కలిసాడు మళ్ళీ ఈసారి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించి తన అభిమాన హీరోను కలిసినందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు