Samantha : ప్రముఖ నటి సమంత ఒక వైపు అనారోగ్యంతో ధైర్యంగా పోరాడుతూ… మరోవైపు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల హరి -హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద సినిమా విడుదల అయ్యింది. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఫిమేల్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన యశోద సినిమాని సమంత తన భుజాలపై మోసిందని చెప్పొచ్చు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. కానీ పలు కారణాల వల్ల సమంత ఈ ఈవెంట్ లో పాల్గొనలేదు. ఈ వేదికగానే అన్ని కుదిరితే యశోద సినిమాకి సీక్వెల్ కూడా తీస్తామని చిత్ర దర్శకులు ప్రకటించారు.
కాగా తాజాగా యశోదా సక్సెస్ పై సమంత స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఆపోస్ట్ లో… ”ప్రియమైన ప్రేక్షకులారా,సినిమాకు వస్తున్న స్పందన నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి” అని సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీ ఈలలు వినడం మరియు థియేటర్లలో వేడుకలు చూడటం యశోద బృందం మొత్తం పడిన కష్టానికి తగిన సాక్ష్యం. నేను ఈ ఆనందంతో మేఘాలలో విహరిస్తున్నాను. యశోద మేకింగ్‌లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నన్ను నమ్మి ఈ సినిమాని నిర్మించిన నిర్మాత కృష్ణ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే దర్శకులు హరి, హరీష్‌లతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకులకు కూడా నా కృతజ్ఞతలు. నా ప్రియమైన సహనటులు వరలక్ష్మి శరత్‌కుమార్ గారు, ఉన్ని ముకుందన్ గారు మరియు మిగిలిన అద్భుతమైన నటీనటులకు కూడా మీతో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది’ అని సమంత తెలిపారు.
🙇♀️🙇♀️🙇♀️#Yashoda pic.twitter.com/O6xdboY0AT
— Samantha (@Samanthaprabhu2) November 18, 2022