Samantha : సమంత (Samantha) తన చేతిలో ఉన్న ఖుషి (Kushi) అండ్ సిటాడెల్ (Citadel) ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసి కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధి భారిన పడిన సమంత.. దాని చికిత్స కోసం అమెరికాకు వెళ్తుందని, అందుకోసమే కొన్నాళ్ళు పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే సమంత మెడికల్ ట్రీట్‌మెంట్ కాకుండా మెడిటేటివ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది.
ఇటీవల కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో ధ్యానం చేస్తూ కనిపించింది. అక్కడే రెండు రోజులు పాటు ఉన్న సమంత.. ‘ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మార్గం అని ఇవాళే అర్థమైంది’ అంటూ పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా ఈ భామ ఇండోనేషియా దీవుల్లో ప్రత్యేక్షమయ్యింది. అక్కడ బాలిలోని చేసింది. ఇక ఈ ఫొటోల్లో ఒక పిక్ లో తాను పెట్టుకున్న టోపీ పై ఉన్న ‘కల మొదలైంది’ పదాన్ని మాత్రమే చూపించింది. ఇక మరో పిక్ లో యోగ ముద్రని చూపిస్తూ కనిపించింది.
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మొన్నటి వరకు వచ్చిన వార్తలు ప్రకారం సమంత అమెరికా వెళ్లి మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకోనుందా? లేదా ఇలా ప్రకృతి పద్దతిలో మెడిటేటివ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటుందా? అనేది తెలియాలి. కాగా విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక సిటాడెల్ రిలీజ్ విషయం ఎటువంటి క్లారిటీ లేదు.