Samantha : ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసిందే లేదని చెప్పాలి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నా ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కాగా ప్రస్తుతం సామ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ “యశోద”. ఈ సినిమాలో సమంత గర్భవతిగా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ ని కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. కాగా ఇప్పుడు తాజాగా సమంత అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది మూవీ టీమ్.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు. ట్రైలర్ లో ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా సరోగసి కథాంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తుంది. పిల్లలు కనలేని మరియు అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వాలనుకునే కొందరు సెలెబ్రెటీస్ కోసం ఒక సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే సమంత కూడా ఒక ప్రముఖ వ్యక్తి కోసం అద్దె గర్భం దాల్చుతుంది. అయితే ఆ సమయంలో అక్కడ జరిగే కొన్ని చట్ట విరుద్ధమైన పనులు సమంత కంట పడతాయి. వాటిని బయటపెట్టే క్రమంలో సమంత ఎదురుకున్న సన్నివేశాలని.. యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు.
ముఖ్యంగా ట్రైలర్ చివరిలో… యశోద అంటే ఎవరో తెలుసుగా, కృష్ణ పరమాత్ముడు తల్లి అంటూ సామ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెచ్చాయి. ఇక సమంత చేసిన ఫైట్స్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. నవంబర్ 11న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు తమిళ డైరెక్టర్స్ హరి-హరన్ లు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం సమంత గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం, తమిళ మల్టీస్టారర్ కథువాకుల రెండు కాదల్ సినిమాలతో సామ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మించే మరో బై లింగ్వెల్ మూవీ, హాలీవుడ్లో ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాలు చేస్తోంది సమంత.