Entertainment ప్రస్తుతం సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యశోద’. గగుణ శేఖర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.. అల్లు అర్హ ఈ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీ దేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ..తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ ఏడాది విడుదల చేయనున్నారు. అయితే నవంబరు 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేడు దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మరోసారి విడుదల తేదీని గుర్తుచేసింది మూవీటీమ్. అలాగే సామ్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత కొంతమందితో ముచ్చటిస్తూ చాలా అందంగా ఉంది. కొన్ని రోజులుగా చర్మానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటుందంటూ అసలు మీడియా ముందుకు కూడా రాలేదు సమంత అయితే ఆమెకు ఏమైంది అంటూ ఆమె అభిమానులంతా తెగ హైరానా పడిపోయారు అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.. కాగా ఇక సామ్ ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ప్రేమకావ్యం ‘శాకుంతలం’తో పాటు, శివ నిర్వాణ దర్శకత్వంలో రానున్న ‘ఖుషి’లో నటిస్తోంది.