“సమతా కుంబ్ – 2023”
శ్రీ రామానుజాచార్య – 108 దివ్య దేశాల ప్రథమవార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా, ప్రధాన వేదికపై
రామానుజ సహస్రాబ్ది సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర ప్రధాన స్తపతి శ్రీమాన్ డి యన్ వి ప్రసాద్ స్థపతి కి “స్థాపత్య కళా సామ్రాట్” అనే బిరుదు ప్రదానం తో సత్కారం!
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి చేతుల మీదుగా ఆలయ స్తపతులకు సత్కారాల కార్యక్రమం జరిగింది.
రామానుజ సహస్రాబ్ది సమతా మూర్తి స్ఫూర్తికేంద్ర ప్రధాన స్తపతి శ్రీమాన్ డి యన్ వి ప్రసాద్ స్థపతి కి శ్రీ చినజీయర్ స్వామి వారు “స్థాపత్య కళా సామ్రాట్” అనే బిరుదును ప్రకటించి ప్రశంసాపత్రాన్ని అందించారు. ప్రసాద్ దంపతులను డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు శాలువాతో సత్కరించారు.
ఇదే వేదికపై 108 దివ్య దేశాల ఆలయాల నిర్మాణ భాద్యతలను స్వీకరించి దిగ్విజయంగా పూర్తిచేసిన శ్రీమాన్ లోహాల్ నరేష్ కుమార్ రాజస్థాన్, శ్రీమాన్ వి సూరి బాబు స్థపతి, తిరుపతి., శ్రీమాన్ బి. సుధాకర్ సింగ్ స్థపతి, బి యస్ అసోసియేట్స్, హైదరాబాద్., శ్రీమాన్ బి. వెంకట్ రెడ్డి స్థపతి, హైదరాబాద్ లను “స్థాపత్య కళా ప్రవీణ” అనే బిరుదులను ప్రకటించి ప్రశంసాపత్రాన్ని అందించారు. శ్రీమాన్ కె పెంచెల ప్రసాద్ స్థపతి (శిలా శిల్పి) తిరుపతి, శ్రీమాన్ కె వెంకటేశ్వర్లు స్థపతి (లోహ శిల్పి) తిరుపతి లకు “శిల్పకళా ప్రవీణ” అనే బిరుదులను ప్రకటించి ప్రశంసాపత్రాన్ని అందించారు.
అలాగే శ్రీమాన్ డి యన్ వి ప్రసాద్ స్థపతి కి మొదటి నుండి వారి సమూహంగా డిప్యూటీ స్థపతులుగా వివిధ సేవలందించిన శ్రీమాన్ జి. శివకృష్ణ స్థపతి, శ్రీమాన్ యు. పురుషోత్తం రెడ్డి స్థపతి, శ్రీమాన్ ఏ. మోహనాచార్య స్థపతులకు “వాస్తు శిల్ప ప్రవీణ” అనే బిరుదులను ప్రకటించి ప్రశంసాపత్రాన్ని అందించారు.
ఇంకా ఈ ప్రాజెక్ట్ లో అసిస్టెంట్ స్థపతులుగా సేవలందించిన శ్రీమాన్ పుడి రాజు, శ్రీమాన్ పూజల కిషోర్, శ్రీమాన్ కె. రాఘవేంద్ర సాగర్, శ్రీమాన్ భూపాల్ సింగ్ భాతి లకు ప్రశంసాపత్రాలను అందించారు.
శ్రీ చినజీయర్‌స్వామి మాట్లాడుతూ…. సమతా మూర్తి కేంద్రం ఏర్పడి ఏడాది అయింది. ఇది ఏర్పడటానికి పూర్వరంగంగా మొదట సమతాస్పూర్తి మూర్తిగా ఒక్కరే ఉంటే చాలు అని మొదట ఆరంభమైనా, ఆ తర్వాత ఆ మూర్తిని దర్శించిన వారికి ప్రేరణ కలిగేలా చేయడం రామానుజులవారి మహోన్నత వ్యక్తిత్వానికి తగ్గట్టు ఉంటుందని భావించి 108 దివ్య దేశాలను ఇక్కడికి తేవాలని సంకల్పం కలిగింది. 2017లో జరగాల్సిన ఆవిష్కరణ కాస్త ముందుకు సాగింది. 2022లో పూర్తయింది.
రామానుజుల వారికి ప్రేరణ ఇచ్చిన దివ్యక్షేత్రాలు మన దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ఆలయాల్లో ఉన్నట్టుగానే గర్భమూర్తి, గర్భాలయం, పైన ఉండే విమానాలను యథాతధంగా ఆవిర్భించేలా చేశాం. నేర్పరులైన స్తపతుల ద్వారా ఈ కార్యక్రమం చేయించాం. ప్రసాద్‌కు ఈ బాధ్యతను జూపల్లి రామేశ్వరరావుగారు అప్పగించారు. భక్తులకు వసతులు, ఇతర వ్యవస్థలు కావాల్సి ఉంది. ఆలయ ప్రాంగణంలోని డైనమిక్ ఫౌంటెన్ సరదా కోసం కాదు. మనం ప్రేమతో రామానుజులకు అర్పించే అభిషేకం. రామానుజుల క్షేత్రంలో అన్నీ 9 సంఖ్యతోనే ఉన్నాయని జీయరుస్వామి అన్నారు.
మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు …. స్వామివారు 2013లో తమిళనాడులో రోశయ్య గవర్నర్‌గా ఉన్నప్పుడు 2017 వెయ్యి సంవత్సరాల పండుగ కానుకగా ఆ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ స్థలం తీసుకుని రామానుజుల స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని 2012లో ప్రాసెస్ మొదలైంది. రామానుజుల స్వామివారిని ప్రపంచానికి గుర్తుండేలా చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లాం. అక్కడ అనుకున్న సహకారం దొరకలేదు. రామానుజులు అనుకున్నట్టున్నారు ఇక్కడికి రావాలని. శిలాఫలకంతో చేయాలని చూశాం, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడికి రావడం జీయరుస్వామి రూపకల్పన, సంకల్పం గొప్పది. మనమంతా చిన్నచిన్న పాత్రధారులం, చాలా అదృష్టవంతులం.
ప్రసాద్ స్తపతి ఎంతో కష్టపడ్డారు. ఈ బృహత్ కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఇది ప్రపంచ స్థాయిలో కొన్ని వేల టెలివిజన్ల ద్వారా ఏ మూలకు పోయినా ఈ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతున్నారు. ఏడు సంవత్సరాలపాటు పనిచేసిన ప్రసాద్ టీమ్‌ను అభినందిస్తున్నాం. జీయరుస్వామి సంకల్పం, రామానుజాచార్యుల మీద ఉండే నమ్మకమే దీన్ని నడిపించింది.
సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర ప్రధాన స్తపతి శ్రీమాన్ డి యన్ వి ప్రసాద్ స్థపతి… స్వామివారి అనుగ్రహంతోనే ఇంతపెద్ద ప్రాజెక్ట్ చేయగలిగాం. చిన్నప్పటి నుంచి చినజీయర్‌స్వామి ప్రవచనాల ప్రభావం నాపై ఉంది.
రామాయణ, భాగవతాల పరమార్థం స్వామీజీ వల్లే తెలిసింది. శాస్త్రీయ శిల్ప కళా నైపుణ్యంతో పాటు జీయరువారి ఆశీస్సులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశాం. డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుగారి సహకారం మరువలేనిది, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన ప్రతిఒక్కరికి రామానుజులవారి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా “స్థాపత్య కళా పరిషద్” – తెలుగు స్థపతుల మండలి, గౌరవ సలహాదారు డా. ఈమని శివనాగి రెడ్డి స్థపతి గారు., కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమాన్ దేశరాజు శ్యామసుందర్ రావు స్థపతి, హైదరాబాద్., ఈ బృహత్ రామానుజ సహస్రాబ్ది సమతా మూర్తి స్ఫూర్తికేంద్ర ప్రధాన స్తపతి శ్రీమాన్ డి. యన్. వి. ప్రసాద్ స్థపతి కి అలాగే ఈ ప్రాజెక్ట్ కు విశిష్ట సేవలందించిన స్థపతులందరికి ఒక ప్రకటనలో ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.