దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధంగా వుంది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ని నిర్వహించిన చిత్ర యూనిట్ నవంబర్ 4న సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న విడుదల కాబోతుంది. ప్రభాస్ గారి చేతులు మీదగా 25న ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ప్రభాస్ అన్న ఫ్యాన్ గా ఇది నాకు చాలా ఎక్సయిటింగా వుంది. మేర్లపాక గాంధీ గారు ఇచ్చిన కథతో ఎక్ మినీ కథ చేశాను. అది మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం అనందంగా వుంది. మా నిర్మాత వెంకట్ బోయనపల్లి గారికి కృతజ్ఞతలు. ఫరియా అబ్దుల్లా తో నటించడం హ్యాపీగా వుంది. బ్రహ్మజీ గారి పాత్రలోనే కాదు ఆయనతో షూటింగ్ లో కూడా చాలా ఫన్ ని ఎంజాయ్ చేశాం” అని చెప్పుకొచ్చారు.
ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ జర్నీ ఒక అడ్వంచర్ లా జరిగింది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. హారిక ఎంటర్‌టైన్‌మెంట్ కి థాంక్స్. సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీ కి కృతజ్ఞతలు. బ్రహ్మాజీ తన పాత్రని చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా పట్ల చాలా ఎక్సయిటింగ్ వున్నాను. నవంబర్ 4న సినిమా విడుదల కాబోతుంది. నా మొదటి సినిమా ‘జాతిరత్నాలు’ ని ఆదరించినట్లే ఈ సినిమాకి కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.