Entertainment : టాలివుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం ఎదరుచూస్తున్నాడు. అయితే రీసెంట్ గా శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో అక్కినేని అమల ఓ ప్రధాన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అమల తనను సొంత కొడుకులా చూసుకునేదని చెప్తూ అమలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు..
శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరోకు ఈ సినిమా ఒక బ్రేక్ అనే చెప్పాలి. ఇందులో అమల ఒక కీలక పాత్రలో నటించింది..
చిన్నప్పటి నుంచీ నాకు అఖిల్ తెలిసినప్పటికీ అమల నాగార్జున గారితో రిలేషన్ లేదు. ఈ సినిమా సమయంలో మా మధ్య బంధం బలపడింది. అమలు గారు నిజంగానే నన్ను మూడో కొడుకులా చూసుకున్నారు.. ఈ సినిమాకి అమలు గారు ఓకే చెప్పిన తర్వాత నేను నటించడానికి ఒప్పుకున్నాను అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు.. ఈ సినిమా హిట్ అవడం నిజంగా చాలా ఆనందంగా ఉందని.. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని రిలీజ్ అయ్యేంతవరకు భయపడుతూ వచ్చామని చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరూ కలిసి తప్పకుండా చూడాల్సిన మూవీ అని అన్నాడు. ఇందులో అమల తో పాటు రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసినదే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా బానే దూసుకుపోయింది..