Sehari Movie Teaser Announcement Funny Video, Virgin Star Harsh Kanumilli, Simran Choudhary, Gnanasagar Dwaraka,
“సెహరి” మూవీ “వర్జిన్ స్టార్” “హర్ష్ కానుమిల్లి “పై ఒక ఫన్నీ వీడియో
సెహరి మూవీ టీజర్ ఈ నెల 16న విడుదల అవుతున్న సందర్బంగా వర్జిన్ స్టార్ హర్ష్ కానుమిల్లి పై ఒక ఫన్నీ వీడియో చేసారు చిత్ర బృందం, సంగీత దర్శకుడు కోటి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడే ఈ అద్వయ జిష్ణు రెడ్డి. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల నటసింహా నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. పోస్టర్ ని విడుదల చేసిన రోజు నందమూరి బాలకృష్ణ వర్జిన్ స్టార్ హర్ష్ కానుమిల్లి మధ్య ఫన్నీ సన్నివేశం జరిగింది, దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఫన్నీ వీడియోని చేసారు. ఈ చిత్రానికి సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తుండగా, ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తున్నారు. ఇంకా బాలకృష్ణ (సీనియర్ యాక్టర్), అభినవ్ గోమటం, ప్రణీత్ కళ్లెం, అనీషా ఆళ్ల, అక్షిత శెట్టి, రాజేశ్వరి, సృష్టి, యశ్వంత్, అనీల్ కుమార్ నటిస్తున్నారు.
https://youtu.be/4kOwuMgQiNw