Entertainment సీనియర్ నటి సుమలత వివాహ వార్షికోత్సవం సందర్భంగా దివంగత భర్త అంబరీష్‌ను తలుచుకుంటూ ఓ నోట్‌ను విడుదల చేసింది.
సుమలత తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా దివంగత భర్త అంబరీష్‌ను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను ఉంచారు. అందులో… “ఈ రోజు గాలిలో మీ గొంతు విని నేను మీ ముఖం వైపు తిరిగా. నేను నిశ్శబ్దంగా నిలబడి ఉన్నప్పుడు గాలి వెచ్చదనం నన్ను తాకింది. నీ ఆలింగనం కోసం నేను కళ్లు మూసుకున్నా. నేను కురుస్తున్న వానను చూస్తూ కిటికీలో నుంచి చూశా. ప్రతి వాన చినుకులో మీ పేరు వినిపించింది. ఈరోజు నేను నిన్ను నా హృదయంలో దాచుకున్నా. అది నాకు సంపూర్ణమైన అనుభూతిని కలిగించింది. నువ్వు చనిపోయి ఉండొచ్చు.. కానీ నువ్వు ఎక్కడికి వెళ్లిపోలేదు. ఎప్పుడూ నాలో భాగమై ఉంటావు. సూర్యుడు ప్రకాశిస్తున్నంత కాలం గాలి వీస్తుంది. వర్షం కురుస్తుంది. అలాగే నువ్వు నాలో ఎప్పటికీ నివసిస్తావు. అది నా హృదయానికి తెలుసు… ఆ రోజు నీతో నడిచిన క్షణం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్ పార్టనర్‌గా నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి నాలో ఏదో కొత్త ఉత్సాహం. ఆ రోజుని పదే పదే గుర్తు చేస్తూ పెళ్లినాటి జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ రోజుని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటా. మన 31 ఏళ్ల వివాహబంధంలో జీవితకాల జ్ఞాపకాలను నాటారు. మీరు అందించిన ప్రేమ, ఆప్యాయతలు నా జీవితానికి బహుమతులు.. ” అంటూ రసుకొచ్చింది.. సుమలత డిసెంబర్ 8న 1991న కన్నడ నటుడు,రాజకీయ నాయకుడు అంబరీష్‌ని వివాహం చేసుకున్నారు.