Movie సినిమాలన్నీ థియేటర్లో హడావిడి చేశాక మిగిలిన సందడి ఓటీటీలో చేస్తాయి.. ఈ వీకెండ్ కి ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఏంటో చూద్దాం.. అయితే ఈ వీకెండ్ కి ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలపై ప్రేక్షకులకు పెద్దగా క్రేజీ లేదనే చెప్పాలి. ఇందులో సీతారామం లాంటి మూవీ ఉండటం ప్రేక్షకులకు ఓ చిన్న ఊరట..
సీతా రామం.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ థియాటర్ వద్ద మంచి హిట్ టాక్ అందుకుంది. అయితే సెప్టెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 7 డేస్ 6 నైట్స్.. సుమంత్ అశ్విన్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మహ.. హన్సిక, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 9 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. భీమ్లా నాయక్.. పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీ తమిళ వెర్షన్ సెప్టెంబర్ 9 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
వీరూమాన్.. కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ తమిళ్ చిత్రం సెప్టెంబర్ 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఏక్ విలన్ రిటర్న్స్.. దిశా పటాని, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన ఈ బాలీవుడ్ మూవీ సెప్టెంబర్ 9 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.తల్లుమాల.. ఈ మలయాళం మూవీ సెప్టెంబర్ 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.