Serial Actress : ప్రస్తుతం బుల్లితెర నటీనటులకు కూడా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగులో గుండమ్మ కథ, గుప్పెడంత మనసు వంటి సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి నాగవర్ధిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉంది. ఆమెను హత్యాయత్నం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… నాగవర్దిని ఆమె రెండో ప్రియుడు శ్రీనుతో కలిసి మొదటి ప్రియుడు సూర్యను భవనం పైనుంచి తోసేసినట్లు సూర్య మిత్రులు ఆరోపిస్తున్నారు.
నాగవర్థిని, సూర్యనారాయణ ఒకప్పడు ప్రేమికులు. ఇద్దరూ కృష్ణానగర్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సహజీవనం కూడా చేస్తున్నారు. కాగా కొంతకాలం క్రితం సూర్యనారాయణ తన స్నేహితుడు శ్రీనివాస్ రెడ్డిని నాగవర్థినికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ నాలుగు నెలలుగా నాగవర్ధిని సూర్యనారాయణకు దూరంగా, శ్రీనివాసరెడ్డికి దగ్గరగా ఉంటుంది. ఆ తరుణంలోనే సూర్యనారాయకు బ్రేకప్ చెప్పింది. ఈ బ్రేకప్ తర్వాత శ్రీనివాస్, నాగవర్థిని కలిసి అదే ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు. సూర్యనారాయణ అదే బిల్డింగ్ లోని పై ఫ్లోర్‌కి మారాడు.
తాజాగా సూర్యనారాయణకు, ఈ జంటకు మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్తా ముదిరి… ఆ జంట ఇద్దరూ కలిసి సూర్యనారాయణనను బిల్డింగ్ పైనుంచి తోసేసినట్లు సమాచారం అందుతుంది. స్థానికుల సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు… సూర్యనారాయణను పంజాగుట్టలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అతని మిత్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నాగవర్దిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.