Entertainment యే మేరీ లైఫ్ హై – బాల్ వీర్ వంటి టీవీ షోలలో కనిపించిన షామా సికిందర్ సంచలన కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేసింది. తాను పరిశ్రమలో ఎన్నో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. తనకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలు తన నుండి లైంగిక ఫేవర్ ఆశించే వారిని స్పష్టం చేసింది.. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి ఒక్క రంగంలో ఉంటుందని.. కాకపోతే సినిమా రంగం అనేది ఎక్కువగా బయట కనిపిస్తుందని తెలిపింది.
టీవీ నటి శ్యామా సికిందర్ బాలీవుడ్ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ కోసం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తాను ఈ రంగంలో ఎన్నో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. తాను పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో చాలామంది నిర్మాతలు అవకాశాలు ఇస్తామంటూ తనతో స్నేహంగా ఉండమనే వారని.. అయితే ఆ స్నేహం అనే భావంలో ఉండే అర్థం తనకు తర్వాత అర్థమైందని అని తెలిపింది.. తనకు అవకాశాలు ఇచ్చి లైంగిక ఫేవర్ అడిగే నిర్మాతలు చాలా మంచి స్థాయిలో ఉన్న వారేనని చెప్పుకొచ్చింది.. అవకాశం ఇచ్చారు కదా అని వాళ్ళ అవసరాలు తీర్చాలి అంటే అంతకన్నా నీచమైన పని ఇంకొకటి లేదని తాను నమ్ముతున్నట్లు తెలిపింది.. అయితే ఇవి ఒకప్పటి రోజులని.. ప్రస్తుతం పరిశ్రమలో యువ నిర్మాతలు ఎక్కువగా ఉన్నారని వీరంతా చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారని తెలిపింది.. ఇప్పటి వాళ్లంతా నటీనటులతో మంచి అనుబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పింది.
ఈ కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఉన్నదని.. ఒక్క సినిమా రంగాన్నే అనటానికి లేదని చెప్పుకొచ్చిన ఈ 41 ఏళ్ల భామ.. ఈ ఏడాది మొదట్లోనే తన చిరకాల మిత్రుడు జేమ్స్ మిల్లి కాన్ తో ఏడు అడుగులు వేసింది..