శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి గారు ఈ రోజు మార్కాపురం పట్టణమునకు విచ్చేసిన సందర్భముగా , కందుల గౌతమ్ నాగి రెడ్డి గారి విన్నపం మేరకు కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్ ని సందర్శించి రోగులకు పండ్లు ప్రసాదాలు అందజేశారు . బాలింతలను పరామర్శించి ఆశీర్వదించారు . పుట్టిన పిల్లలను దీవించి , హాస్పిటల్ స్టాఫ్ ని ప్రేమతో పలుకరించి “ మానవ సేవయే మాధవ సేవ అని హితోపదేశం చేసారు.
ఎందరో ప్రధానమంత్రులు , రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాజకీయ వేత్తలు, వ్యాపార దిగ్గజాలు , శాస్త్రవేత్తలు , విద్యావేత్తలు చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులతో, అనుగ్రహంతో మంచి పురోభివృద్ధి సాధించి, తమ తమ రంగాల్లో ఉన్నతంగా రాణించడం అతిశయోక్తి కాని విషయం.
ఒక వేద గురువుగా , హిందూ ధర్మ ప్రచారకులుగా, ఆధ్యాత్మిక ఉపదేశకులుగా ప్రపంచ ప్రఖ్యాతి గడించిన చిన్న జీయర్ స్వామి గారు తమ హాస్పిటల్ నందు పాదం మోపడం , అందరినీ ఆశీర్వదించడం అమితానందాన్ని కలుగజేసిందని గౌతమ్ రెడ్డి తెలిపారు. గౌతమ్ నాగి రెడ్డి గారు చేస్తున్న సేవలను ప్రశంసించి , ఎంతో వృద్ధిలోకి రావాలని మంచి భవిష్యత్తు కలగాలని జీయర్ స్వామిగారు ఆశీర్వదించారు !!