Siddhu Jonnalagadda : డీజే టిల్లుతో టాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమాని ప్రకటించారు. నేడు అధికారికంగా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా సినిమా ఓపెనింగ్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇటీవల అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా తీసి మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన భాస్కర్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సిద్దుతో ప్లాన్ చేశాడు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ అయింది. భాస్కర్ తెరకెక్కించే ప్రేమకథలకు సిద్దు లాంటి హీరో తోడైతే వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ అవ్వడం ఖాయం. మరి రొమాంటిక్ బాయ్ సిద్ధుకి లవ్ సినిమాలు తీసే భాస్కర్ తోడైతే ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాని SVCC పతాకంపై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారో చూడాలి.
ఇక సిద్ధు విషయానికి వస్తే త్వరలో డీజే టిల్లు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.అయితే ఈ సారి సిద్దు తన నెక్స్ట్ మూవీ లో లవర్ బాయ్ లా కనిపించనున్నాడు . సిద్ధు లాంటి హీరో కి భాస్కర్ తోడైతే ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి . కానీ వీళ్ళ కాంబినేషన్ సక్సెస్ అవుతుందని అంతా అనుకుంటున్నారు