Entertainment సింగర్ సునీత ప్రస్తుతం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అని తెలుస్తొంది.. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..
సునీత… సింగర్ గా అలరిస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.. ఎంతో అనుకువగా ఉంటూ తన పని తన చేతికు పోయే సునీతకి సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు.. కెరీర్‌లో ఏకంగా 120 మందికి పైగా హీరోయిన్స్‌కి పైగా డబ్బింగ్ చెప్పి ఔరా అనిపించారు. ఇక నిత్యం నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే సునీత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటికి తరగని అందంతో హీరోయిన్స్ సైతం అసూయపడేలా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు సునీత..అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటూనే ఉంటుంది.. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈమె ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రంలో నటించిన వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి..
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటుంది. అయితే ఇందులో ఓ ప్రముఖ పాత్రలో నటించేందుకు సింగర్స్ సునీతను కలిశారంట చిత్ర దర్శకుడు ఆమెకు ఆ పాత్ర నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది.. ఈ సినిమాలో మహేష్ బాబు అక్కగా సునీత నటిస్తారని టాక్ వినిపిస్తోంది.. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో మాత్రం తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికార ప్రకటన రావాల్సిందే..