ఇటీవల విడుదలైన చిన్న సినిమాల్లో ‘సీతారామం’ సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. స్టార్ ఇమేజ్ ఉన్న నటులు ఎవరూ లేకపోయినా.. కేవలం కథా బలంతోనే భారీ హిట్‌ను ఆ మూవీ సొంతం చేసుకుంది. పెద్ద పెద్ద సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న ఈ సమయంలో మంచి కంటెంట్ ఉంటే చాలు.. ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని సీతారామం నిరూపించింది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా హిట్ అందుకున్న ఈ మూవీ.. ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఆ గుడ్‌న్యూస్ చెప్పేసింది. సెప్టెంబర్ 9 నుంచి ఈ మూవీ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని తెలిపింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన, ప్రకాశ్‌రాజ్, గౌతమ్ మీనన్, సుమంత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించింది.