Sitara Ghattamaneni : మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ సందడి చేస్తుంటుందని అందరికి తెలిసిన విషయమే. మొన్నటివరకు యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ అంటూ సోషల్ మీడియా వరుకే ఉన్న సితార.. ఇటీవల ఒక జ్యువెల్లరీ సంస్థకు అంబాసడర్ గా సైన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ సంస్థ కోసం చేసిన యాడ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సితార చెంతకు మరికొన్ని బ్రాండ్స్ కూడా వచ్చి చేరుతున్నాయని తెలుస్తుంది.
కాగా సితార ప్రస్తుతం లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల నమ్రతా, గౌతమ్ అండ్ సితార కలిసి అమెరికా టూర్ కి వెళ్లారు. ఇక అక్కడ వీధుల్లో సందడి చేస్తూ దిగిన ఫోటోలను నమ్రతా అండ్ సితార తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సితార కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఆ ఫొటోల్లో సితార షార్ట్ స్కర్ట్ లో కనిపిస్తుంది. ఇక ఫోటోలను మహేష్ ఫ్యాన్స్ లైక్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక మహేష్ బాబు గుంటూరు కారం (Guntur Kaaram) విషయానికి వస్తే.. ఈ మూవీ యూనిట్ నుంచి ఒక్కొక్కరిగా బయటకి వెళ్లిపోతున్నారు. ముందు ఫైట్ మాస్టర్స్, ఆ తరువాత హీరోయిన్, ఇటీవల కెమెరా మ్యాన్.. ఇలా వరుసపెట్టి మూవీ నుంచి వెళ్లిపోతుండడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈమధ్యన సోషల్ మీడియాలో మరో వార్త కూడా చక్కర్లు కొట్టింది. అదేంటంటే.. ఈ సినిమా కథ అసలు ఎన్టీఆర్ కోసం రాసుకున్నది అంటా. అనుకోకుండా ఈ మూవీలకి మహేష్ రావడంతో అనేక చేంజస్ జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి.