Devotional news: ఆంజనేయ స్వామి గురించి తెలియని వారు ఎవరు ఉండరు అనే చెప్పుకోవాలి. 14 వారాలు పాటు ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్లన ఇంట్లో ఉండే శని పోతుందట అంతే కాకుండా ఆ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా జీవిస్తారు, ఆ ఇంట్లో ఇటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. ఇంటికి ఉన్న నరదిష్టి పోతాయని పురోహితులు తెలపడం జరుగుతుంది. హనుమంతుని పూజలో స్వామి వారికి పూజ సమర్పణ మరియు పూజ యొక్క విధి విధానాలు తెలుసుకోండి మరి.
ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం అట. దీనికి పురాతన కథ అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి ఆంజనేయ స్వామి కలిసి రామయ్య గురించి చెప్పినప్పుడు సీతమ్మ వారి సంతోషంతో హనుమంతునికి దగ్గరలో పువ్వులు కనిపించక తమలపాకుల దండ వేశారట అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
ఆంజనేయ స్వామి కి ప్రతి మంగళవారం అరటికాయ తమలపాకు, కొబ్బరికాయ ఇలా 14 వారాలు సమర్పిస్తే సకల మేలు జరుగుతాయి అని మన పురాతన శాస్త్రాలలో వివరించడం జరిగింది. ముందుగా కుటుంబ సభ్యులందరూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాలి. ఆ తర్వాత స్వామి వారికి తమలపాకు దండలను సమర్పించుకోవాలి. అదేవిధంగా పూలు పండ్లను కూడా హనుమంతునికి సమర్పించుకోవాలి ఇలా 14 రోజులు పాటు చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.