Crime ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగిన శ్రద్దా హత్య కేసు దేశమంతా కలకలం లేపిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంపై దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు పలు ప్రాంతాల్లో ఆమె మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.. ఇందుకు సంబంధించి ఏ రకమైన ఆధారాలు దొరుకుతాయా అని గాలిస్తున్నారు..
శ్రద్ధ వాకర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది.. ఈ విషయంలో పోలీసులు తమ ఇన్వెస్టిగేషను ముమ్మరం చేశారు.. ఢిల్లీతో పాటు హిమాచల్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఆధారాల కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. ఈ క్రమంలోనే ఆఫ్తాబుకు సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇందులో అక్టోబర్ 18 నాటి ఫుటేజ్ ని పరిశీలించగా ఆఫ్త మూడుసార్లు బయటకు వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది.. అయితే ఈ సమయంలో అతను చేతిలో బ్యాగులు ఉన్నాయని ఇందులో శ్రద్ధ మృతదేహానికి సంబంధించిన మొక్కలు ఉండి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఆమె శరీరానికి సంబంధించి 13 ముక్కలు లభించాయని అయితే ఆమె తల మాత్రం ఎక్కడ ఉందో లభించలేదని చెబుతున్నారు.. దీంతో పోలీసులు ఆమె తల కోసం మెహ్రౌలీలోని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్నారు. నివేదికల ప్రకారం, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సహాయంతో పోలీసులు ఆదివారం మెహ్రౌలీ చెరువును ఖాళీ చేసే పనిని ప్రారంభించారు. మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఈ చెరువు చాలా పెద్దదని 15-20 అడుగుల లోతు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే ఇందులో శ్రద్ధ తలను విసిరివేసి ఉన్నాడా లేదా అనే విషయం మాత్రం తెలియలేదు..