‘శ్రీకారం’ సక్సెస్ మీట్
శర్వానంద్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా 14 రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్.బి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ….
డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ – ‘‘రాత్రి సినిమా చూశాను. కిషోర్ 2016లోనే శ్రీకారం సినిమా షార్ట్ ఫిలింగా తీశాడు. దాన్నే ఇప్పుడు ఫీచర్ ఫిలింగా మలిచాడు. తొలి సినిమాకే ఇలాంటి స్టోరి ఎంచుకోవడం గొప్ప విషయం. నేను పల్లెటూరి నుంచి వచ్చాను కాబట్టి సినిమాకు వెంటనే కనెక్ట్ అయ్యాను. శర్వాగారు ఎక్సలెంట్‌గా పెర్ఫామ్ చేశారు. యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా’’ అన్నారు.
హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ మాట్లాడుతూ – ‘‘‘శ్రీకారం’ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అందరూ చూడాల్సిన సినిమా’’ అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ – ‘‘డైరెక్టర్ కిషోర్ ఈ కథను నెరేట్ చేశాడు. తర్వాత ఏ క్యారెక్టర్ చేస్తున్నానో అడిగినప్పుడు ..ఏకాంబరం క్యారెక్టర్ చేయాలని చెప్పాడు కిషోర్. ఆ పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓస్టూడెంట్‌లా ఆ పాత్ర చేసి కొన్ని విషయాలను నేర్చుకున్నాను. రామ్, గోపీ ఆచంటలు చాలా డేడికేటెడ్ ప్రొడ్యూసర్స్. సినిమాపై ప్యాషన్ ఉన్నవాళ్లు కాబట్టి ఇంత మంచి సినిమా తీశారు. ప్రతి ఆర్టిస్ట్ ఇన్‌వాల్వ్ అయ్యి నటించారు. మంచి కథపడితే ప్రతి ఆర్టిస్ట్ ఎలివేట్ అవుతాడనికి ఈ సినిమా ఒక ఉదాహరణ’’ అన్నారు.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ – ‘‘శ్రీకారం సినిమా చూడగానే కిషోర్‌ని చూస్తే చాలా ముచ్చటేసింది. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను జెన్యూన్‌గా చెప్పాడు. నేను అప్పుడప్పుడు సంక్రాంతికి ఇంటికెళ్లినప్పుడు టౌన్ నుంచి వాళ్ల పిల్లలు వస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తుండటాన్నిగమనించా