Entertainment వాల్తేరు వీరయ్య చిత్రం త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతుంది.. ఇందులో మెగాస్టార్ సరసన శృతిహాసన్ నటించింది.. తాజాగా ఈ సినిమాలో తాను ఇబ్బంది పడిన సందర్భంగా చెప్పుకొచ్చింది..
మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. అలాగే సంక్రాంతి త్వరలో మరిన్ని టాలీవుడ్ సినిమాలు ఉండటంతో అభిమానులకి పండగనే చెప్పాలి.. నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకి రాబోతుంది ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా ఈ సినిమా నుండి శ్రీదేవి పాట విడుదలై పెద్ద హిట్ అయింది అయితే ఈ పాటలు తాను ఇబ్బంది పడిన ఒక సందర్భం కోసం చెప్పకు వచ్చింది శృతిహాసన్..
శ్రీదేవి పాట ఇప్పటికే విడుదల ప్రేక్షకుల్ని అలరించింది.. ఆలాగే వీరిద్దరి కాంబినేషన్‌లో డిజైన్ చేసిన మరిన్ని సాంగ్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన శ్రీదేవి పాటలో మొత్తం మంచే కనిపిస్తుంది ఈ టైంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది ఆ మంచులో చీరతో డాన్స్ చేయడానికి ఎంత ఇబ్బందిగా అనిపించిందని కానీ అభిమానులు ఇలాంటి వాటిని చాలా ఎక్కువగా ఇష్టపడతారని అనిపించి మళ్లీ నటించడానికి ఒప్పుకున్నా అంటూ తెలిపింది.. అలాగే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు అలాగే దర్శకుడు బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు..