అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం, తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలి, నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకం, వ్యవసాయ అభివృద్ది, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికం, ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్ ఎ ఓ వెల్లడించింది, మన కీర్తి పెరగడం తెలంగాణకు గర్వకారణం, హైదరాబాద్ ను చూసి గర్వపడే పరిస్థితి కేసీఆర్ కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపుతో ఐటీ రంగంలో తెలంగాణ ముందుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుంది, వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎగబాకినం.
విత్తన బాంఢాగారంగా ప్రపంచస్థాయిలో కీర్తి గడిస్తున్నాం, ఒక్కొక్క రంగం అభివృద్ది ద్వారా హైదరాబాద్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నాం, కాళేశ్వరం ద్వారా ఏటి ఏరును ఎదురెక్కించి మల్లన్న సాగర్ ను నింపిన ఘనత కేసీఆర్ గారిది, కోటి ఎకరాలకు పైగా తెలంగాణలో భూములు సాగవుతున్నాయి, పత్తి సగటు దిగుబడిలో దేశంలో అగ్రభాగంలో ఉన్నాం, వరి దిగుబడిలో పంజాబ్ ను తలదన్నినం, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, సాగు అనుకూల విధానాల మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ఈ నేపథ్యంలో విత్తనరంగం మీద దృష్టి సాధించడం జరుగుతున్నది, ప్రపంచంలో 70,80 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి, విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి, విత్తన దృవీకరణ, పరీక్షల ల్యాబ్ వినియోగం మరింత పెరుగుతుంది. రాజేంద్రనగర్ లో తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షాకేంద్రం ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు , ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు తదితరులు.