Viral Video : క్లాస్ లో బాగా అల్లరి చేస్తున్నావంటూ నొచ్చుకున్న టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ చిన్నారి ఆమెకు క్షమాపణలు చెబుతున్న వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడ జరిగిందో స్పష్టత లేని ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం అది సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నీకు ఎన్నిసార్లు చెప్పినా క్లాసులు అల్లరి చేస్తూనే ఉన్నావు. మళ్ళీ మళ్ళీ చేయను అంటూనే ఇంత అల్లరిగా ప్రవర్తిస్తున్నావు అంటూ ఆ టీచర్ విద్యార్థి పట్ల చిరు కోపం ప్రదర్శించింది. ఇకపై నీతో మాట్లాడను అంటూ అన్న మాటలకు హర్ట్ అయిన ఆ చిన్నారి ఇకపై అల్లరి చేయను అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడాడు.
అయితే, దీనికి ఆ చిన్నారి స్పందిస్తూ.. ఇకపై ఎప్పుడూ అల్లరి చేయబోనంటూ ఆ అలిగిన టీచర్‌ను సముదాయించే ప్రయత్నం చేస్తాడు. ఇకపై చేయను.. నిజంగా చేయను అంటూ ఆ విద్యార్థి ముద్దుముద్దుగా పదేపదే చెప్పడంతో ఆ టీచర్ భలే ఆనందపడుతుంది. అయితే ముద్దుపెట్టుకోమని అడగటంతో ఆ టీచర్ రెండు చెంపలపైనా ఆ చిన్నోడు ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్ల ఆదరిస్తుండటంతో ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికే 3.32లక్షల మంది వీక్షించారు. 18వేల మంది లైక్ చేశారు. ఆ టీచర్ స్టూడెంట్ మద్య ఉన్న అందమైన రిలేషన్ చూసి ప్రతి ఒక్కరూ భలే ఉందిగా అంటున్నారు.. ‘వీడియో ఎంతో ముద్దుగా ఉంది’, ‘మా పాఠశాల రోజుల్లో ఇలాంటి టీచర్లు ఎందుకు లేరు’.. బుడ్డోడు భలే అందంగా ఉన్నాడు.. అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ऐसा स्कूल मेरे बचपन में क्यों नहीं था 😏😌 pic.twitter.com/uz07dvlehb
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) September 12, 2022