Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఈటివి ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా… ఇరు తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన కామెడీతో టైమింగ్ తో, నటనతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రష్మీ, సుధీర్ జోడికి అభిమానులు ఎక్కువే ఉన్నారు. వీరిద్దరు నిజంగా ప్రేమలో ఉన్నారో లేదో తెలీదు కానీ ఈ పుకార్ల కారణంగా మాత్రం వీళ్ళు బాగా ఫేమస్ అయ్యారని చెప్పాలి. అతి తక్కువ సమయంలోనే ఈ జంటకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది.
సుధీర్ జబర్ధస్త్ షో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో లో కూడా యాంకర్‌గా చేస్తున్నాడు. కాగా ఇటీవల ఈ షో నుంచి సుధీర్ అనుహ్యంగా తప్పుకున్నాడు. అటు జబర్ధస్త్ షోలో కూడా సుధీర్ కనిపించలేదు. కొన్ని నెలలుగా పలు ఛానల్స్‌లో యాంకర్‌గా అలరించారు. అయితే సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవి డ్రా కంపెనీకి కూడా రష్మీ ఒంటరిగానే హోస్ట్ గా వ్యవహరిస్తుంది.
ఇప్పుడు తాజాగా ఈ షోకి సుధీర్ రీఎంట్రీ ఇచ్చేశాడు. ఈ మేరకు తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో సుధీర్, రష్మీతో కలసి డాన్స్ చేశాడు. అలానే బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ తన పాటతో అందరిని కన్నీరు పెట్టించింది. స్టేజ్ పై కూర్చున్న రష్మీ కన్నీళ్లు పెట్టుకోవడంతో… ఆమెను సుధీర్ ఓదార్చాడు. అనంతరం కమెడియన్ నూకరాజు కాంతార క్లైమాక్స్ ను రీక్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.