Entertainment కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ హీరోగా కూడా సినిమాలు చేస్తూ పోతున్నారు అయితే తాజాగా ఈయన హీరోగా వచ్చినా రెండో చిత్రం గాలోడు అయితే ఈ సినిమాకి సుధీర్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జబర్దస్త్ వేదికపై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుదీర్ ఆ తర్వాత హీరోగా వచ్చిన అవకాశాల్ని అందుపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్న ఈ హీరో తాజాగా గాలోడు చిత్రంలో నటించాడు ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది.. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని రన్ అవుతుంది. అయితే తొలి రోజు నుంచి మంచి వసూలు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ రెండు కోట్లు మార్కులు దాటిందని సమాచారం అయితే ఈ సినిమాకు సుధీర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ఈ సినిమాకు ఆయన 50 లక్షలు వరకు డిమాండ్ చేశారని తెలుస్తోంది.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులంతా అంత రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అంటూ నోరు వెళ్ళబెడుతున్నారు
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ తదితర ప్రోగ్రామ్స్ ద్వారా టీవీ ప్రేక్షకులకి బాగా చేరవైన సుధీర్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది… అలాగే కమెడియన్ గా నటించిన హీరోని హీరోగా ఆదరించడానికి కొంతవరకు ప్రేక్షకులు ఆలోచించినా.. ఇది కొందరు విషయంలో మాత్రం సక్సెస్ఫుల్గానే కొనసాగుతుంది అలాగే సుధీర్ కూడా హీరోగా మంచి అవకాశాల్ని అందుపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు..