Entertainment దాదాపు 20 ఏళ్లుగా యాంకరింగ్ లో కొనసాగుతున్న సుమ కనకాల ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పనున్నారా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..
ఆడియో ఫంక్షన్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఏదైనా సుమ యాంకరింగ్ అంటే ఆ ఫంక్షన్ కి కల వచ్చేస్తుంది అచ్చం తెలుగమ్మాయిలానే స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ తన పంచులతో అందరినీ ఇన్నాళ్లు ఆకట్టుకున్న సుమా కనకాల తనకెంతో ఇష్టమైన యాంకరింగ్‌కు గుడ్ బాయ్ చెప్పబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది.. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సుమ ఇకమీదట యాంకరింగ్ ను కొనసాగించడం కష్టమని భావిస్తున్నట్టు సమాచారం..
కేరళలోని పాలక్కాడ జిల్లాలో పుట్టిన సుమ తర్వాత తెలుగు ఇండస్ట్రీ వైపు వచ్చారు కెరియర్ ఆరంభంలో సీరియల్ లో నటించిన సుమ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించారు అయితే కొన్నాళ్ల తర్వాత నటనకు గుడ్ బాయ్ చెప్పేసి యాంకర్ గా సెటిలైపోయారు 47 ఏళ్ల వయసులో కూడా ఎంతో చలాకీగా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు అయితే గత కొన్ని ఏళ్లుగా తన కుటుంబంలో వచ్చిన కొన్ని సమస్యలతో బాధ్యతలు ఎక్కువైనట్టు తెలుస్తుంది అంతేకాకుండా వయసు వలన వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలు వేధిస్తున్నట్టు వీటన్నిటిని బ్యాలెన్స్ చేయలేక ఇక నటనకు గుడ్ బాయ్ చెప్పాలి అనుకున్నట్టు తెలుస్తుంది..