సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జి ఇలా రా’ ‘సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. చాందినీ అయ్యంగార్ హీరోయిన్. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గరుడవేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో పాటు సినిమాటోగ్రాఫర్‌గా కూడా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దర్శకుడు మారుతి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ ఈవెంట్ లో నందు, సప్తగిరి, డైమండ్ రత్నబాబు, తాగుబోతు రమేష్ సుడిగాలి సుదీర్, ప్రసన్న , మధు నందన్, రామ సత్యనారాయణ, శకలక శంకర్ తదితరులు హాజరయ్యారు.
నటీనటులు : సునీల్, ధనరాజ్, చాందినీ , పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యర్, సత్యకృష్ణ వేణు, భూపాల్, టెంపర్ వంశీ తదితరులు
సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే: జి.నాగేశ్వర రెడ్డి
సినిమాటోగ్రపీ, దర్శకత్వం: గరుడవేగ అంజి
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి
సమర్పణ: రూపా జగదీశ్
బ్యానర్స్: జి.నాగేశ్వర రెడ్డి టీమ్ వర్క్, ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి
మ్యూజిక్: సాయికార్తీక్
డైలాగ్స్: భాను, చందు
ఆర్ట్: చిన్నా
ఎడిటర్: చోటా కె.ప్రసాద్
ఫైట్స్: రియల్ సతీశ్
కాస్ట్యూమ్స్: మనోజ్
మేకప్: వాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్