Krishna : తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ పొంది. సూపర్ స్టార్ కృష్ణగా ఎదిగిన మహనీయుడు ఘట్టమనేని కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు ఉండరు. నటుడిగా తనదైన శైలిలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణ. సినిమా నటుడు గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలతో ప్రజాధరణ పొందారు. కృష్ణ హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా – గూఢచారి 116, అప్పట్లో ఆయనకు తొలి కౌబాయ్ సినిమా – మోసగాళ్ళకు మోసగాడు. తొలి ఫుల్ స్కోప్ సినిమా- అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎం ఎం సినిమా – సింహాసనం ఇవి కృష్ణ నటించిన సినిమాలే.
కృష్ణ తన అద్భుతమైన నటనతో నటించిన సినిమాలు పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలతో విజయం సాధించారు. పలు హాలీవుడ్ తరహా జాన్రా చిత్రాలను సినిమా తెరకు తొలుత అతనే పరిచయం చేశాడు. ఇక సాంకేతికంగాను పలు తెలుగు సినిమాలు కృష్ణవే. ఆయన నటించిన కొల్లేటి కాపురంలో తెలుగులో ఆర్. ఓ.సాంకేతికత ఆయనే పరిచయం చేశాడు. సినిమా మీద మంచి అవగాహన, పట్టు, అంచనా ఉన్న నిర్మాతలలో కృష్ణ ఒకరు. విడుదలైన సినిమా కలెక్షన్ బట్టి సినిమా ఇన్ని రోజులు ఆడబోయేది ఆయనకు అంచనా ఉండేది. ఇటువంటి మంచి వ్యక్తి అందరాని లోకాలకు చేరిపోయారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు అందరూ ఆశిస్తున్నారు. నిర్మాతగానూ రాణించారు కృష్ణ. తెలుగులో మాత్రమే కాదు హిందీ, తమిళ, కన్నడలోనూ పద్మాలయ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు తీశారు. హిందీలో హిమ్మత్‌వాలా, పాతాళ భైరవి, మనాలి వంటి బ్లాక్‌బస్టర్స్ పద్మాలయ ఇమేజ్‌ని మరింత పెంచాయి. సతీమణి విజయ నిర్మల దర్శకత్వంలో విజయకృష్ణ బ్యానర్‌లో ఎన్నో సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు కృష్ణ.