Suprem Court Chief Justice of India, NV Ramana, Allola Indrakaran Reddy, Guntakandla Jagadish Reddy, Yadadri Sri Laxminrisimha Swamy Temple, Bhakthi News,
BHAKTHI NEWS: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
యాదాద్రి, జూన్ 15: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, వేద ఆశీర్వచనాలు అందించిన అర్చకులు.
అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. భాలాలయంలో దర్శనం అనంతరం ప్రదానాలయం రాతి కట్టడాలను, కృష్ణ శిలల గోపురాలను, పరిశీలించిన CJ NV రమణ దంపతులు.