Sushanth : అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన సుశాంత్ మొదట్లో కాళిదాసు, అడ్డా, కరెంట్ సినిమాలతో మెప్పించాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలు రావడంతో కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన సుశాంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రల్లో చేస్తున్నాడు సుశాంత్. త్వరలో సుశాంత్ భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రాబోతుంది. ఈ సినిమాలో సుశాంత్ నటిస్తున్నాడు.
భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది. కీర్తి సురేష్ సరసన సుశాంత్ నటిస్తున్నాడు. అలాగే తమన్నా సుశాంత్ కి సోదరి వరుస పాత్ర చేస్తుంది. అయితే సుశాంత్ మొదటి సినిమా కాళిదాసులో తమన్నా హీరోయిన్ గా నటించింది. వీళ్లిద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ కూడా ఉన్నాయి ఆ సినిమాలో. ఇప్పుడు ఏమో ఇలా బ్రదర్ & సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు తమన్నా, సుశాంత్.
హీరో హీరోయిన్స్ గా చేసిన నటులు సోదరీసోదరీమణులుగా చేయడం ఇదేమి కొత్త కాదు గతంలో ఎంతోమంది చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ సావిత్రి కూడా హీరో హీరోయిన్స్ గా చేసి అన్నా చెల్లెల్లు గా మెప్పించారు. ఇటీవల చిరంజీవి నయనతార కూడా ఒక సినిమాలో హీరో హీరోయిన్స్ గా చేసి గాడ్ ఫాదర్ సినిమాలో అన్నా చెల్లెళ్లుగా కనిపించారు.ఇప్పడు వీళ్ళు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు .