Entertainment టాలీవుడ్ హీరోయిన్ తమన్నా నటిగా తన కెరిర్ ను ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.. ఈ సందర్భంగా ఇన్నాళ్ల తన సినీ కెరియర్ ఎలా గడిచిందో చెప్పకు వచ్చింది ఈ భామ..
హీరోయిన్ తమన్నా తాజాగా ఇంటర్వ్యూలో ఎన్నాళ్ళ తన సినీ జీవితం ఏ విధంగా గడిచిందో చెప్పకు వచ్చింది.. మొదటిసారి చతుర పరిశ్రమ లోకి అడుగుపెట్టినప్పుడు ఇన్నాళ్లు ఇక్కడ ఉంటానని అనుకోలేదని.. అలాగే ఇన్నేళ్లు తనకు తెలియకుండానే సినిమాలతో జీవితం గడిచిపోయింది అని తెలిపింది..
“నిజానికి నేను చిత్రసీమలోకి అడుగు పెట్టినప్పుడు ఇన్నేళ్లు ఇక్కడ ఉంటానని అస్సలు అనుకోలేదు. అయితే నా సినీ ప్రయాణం మొదలై ఇన్నేళ్లు గడుస్తున్నా సినిమాలపై నాకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. పరిశ్రమలోకి వచ్చినప్పుడు నటన పట్ల ఎంతో కసిగా ఉండేదాన్ని అలాగే ఎక్కువ సినిమాలు చేయాలి అని కాకుండా చేసినంతవరకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలని నిర్ణయించుకున్న అలాగే నా మనసుకు నచ్చిన కథలనే ఎంచుకున్న అంటూ వచ్చా. అలాగే భవిష్యత్తులో నిర్మాతగా మారాలని ఉంది.. నా కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు నన్ను నేను ఎప్పుడూ స్టార్‌గా భావించుకోలేదు. ఇప్పుడూ అలా చూసుకోవాలని అనుకోవడం లేదు. నన్ను నేను ఓ మంచి నటిగానే చూసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఇలా ఉండగలిగినప్పుడే ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించగలను. నా పాత్ర నిడివిని దృష్టిలో పెట్టుకొని నేనెప్పుడూ సినిమా ఎంచుకోను. కథలో నాలుగైదు సన్నివేశాలున్నా ఆ పాత్ర ప్రభావం బలంగా ఉంటే చాలు. సైరాలో నా పాత్ర నిడివి తక్కువే. కానీ ఆ పాత్ర తాలూకూ ప్రభావం కథలో చాలా బలంగా కనిపిస్తుంది.. అలాగే ఇప్పటివరకు నా పెళ్లి పైన చాలా వదంతులు వచ్చాయి నాకు ఓ డాక్టర్ తో పెళ్లి కుదిరిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి కానీ అవి ఏవి నిజం కాదు.. ” తమన్నా..