Movie టాలీవుడ్ కథానాయిక తమన్నా ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. ఇందులో సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ కీలక పాత్రల్లో నటించారు.వాస్తవిక సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 23న విడుదలవుతోంది. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్మీట్లో.. సినీనటి తమన్నా బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. ఈ క్రమంలో కొందరు మీడియా ప్రతినిధులు గాయపడినట్లు సమాచారం..
అయితే ప్రెస్ మీట్ ముగిశాక.. మీడియా ప్రతినిధులు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తమన్నా బౌన్సర్లు.. మీడియా ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్లు గాయపడినట్లు తెలిసింది.
అయితే ఈ చిత్రం ఉత్తరాదిలోని బౌన్సర్ల పట్టణం అయిన ‘ఫతేపూర్’ చుట్టూ నడుస్తుంది. ఈ సందర్భంగా ఇటీవలే చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.. ఇందులో ‘ఓయ్.. ఇది విన్నారా? బబ్లీ బౌన్సర్ సమయం వచ్చేసింది. మనసుకి నచ్చినవాళ్లతో తను దోస్తీ చేస్తుంది. నచ్చకపోతే ఎములు విరిచేస్తుంది. తొందర్లోనే అది మీకు అర్థమవుతుంది’ అంటూ ఓ క్యాప్షన్‌ను జోడించింది తమన్నా. ఈనెల 23 తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రానుంది. వినీత్ జైన్, స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.