Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తుంది. బాలీవుడ్ లస్ట్ స్టోరీస్ తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు సౌత్ లో రెండు పెద్ద సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేస్తుంది. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తమన్నా సౌత్ హీరోలు గురించి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan) అండ్ నాగచైతన్య (Naga Chaitanya) విషయంలో చిరు అండ్ నాగ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడింది.
“సౌత్ యాక్టర్స్ ప్రతి ఒక్కరితో ఎంతో గౌరవంగా ఉంటారు. వారంతా సంస్కారవంతులు మరియు గౌరవప్రదంగా చాలా మంచి ప్రవర్తనతో ఉంటారు. నేను అక్కడ చరణ్ అండ్ చైతన్యతో కలిసి నటించాను. చిరంజీవి సార్, నాగార్జున సార్ వారిద్దర్నీ చాలా గొప్పగా పెంచారు. చిరంజీవి సర్ సెట్‌లో ఉన్న మహిళను సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటారు” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తాను పెద్ద స్టార్‌ని అవుతానని నమ్మిన మొదట వ్యక్తి చిరంజీవి అని, రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న సమయంలో తనకి ఈ విషయం చెప్పినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా తమన్నా ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్ (Bholaa Shankar), రజినీకాంత్ తో జైలర్ (Jailer) సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు ఆగష్టులో రోజు గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయి. భోళా శంకర్ ఆగష్టు 11న, జైలర్ 10న రిలీజ్ అవ్వబోతున్నాయి. భోళాశంకర్ ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక ముఖ్య పాత్ర చేస్తుంది.