Nikhil : యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది అనుకోని రీతిలో కార్తికేయ 2 చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. రీజనల్ మూవీగా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఘన విజయాన్ని సాధించింది. కాగా ఈ సినిమాతో నిఖిల్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ” 18 పేజీస్ ‘ .
ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హెరోయిన్ గా నటిస్తుండగా… ప్రస్తుతం ఈ సినిమా వర్క్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ జత కానుంది. తమిళ హీరో శింబు ఈ చిత్రంలో ఓ పాట పాడుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు శింబు సుపరిచితుడే. మన్మథుడు, వల్లభ చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆయన మెప్పించారు. హీరో గానే కాకుండా సింగర్ గా కూడా శింబు తన టాలెంట్ ని నిరూపించాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్‌షా, మంచు మనోజ్ హీరోగా నటించిన పోటుగాడు, రామ్ హీరోగా నటించిన ది వారియర్ చిత్రాల్లో శింబు పాటలను పాడాడు.
తాజాగా ఈ లిస్టులో ‘18 పేజీస్’ సినిమా కూడా చేరనుంది. కాగా సినీ వర్గాల్లోని సమాచారం మేరకు ఈ సినిమాలో ‘టైమ్ ఇవ్వు పిల్లా టైమ్ ఇవ్వు’ అనే పాటను శింబు పాడనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ పాటను మూవీ యూనిట్ రిలీజ్ చేయనుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.