Entertainment వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే విరామ సమయంలో బైక్, సైకిల్ రైడింగ్, స్టంట్స్, రైఫిల్ షూటింగ్ వంటి సాహసాలతో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు.. తమిళ స్టార్ హీరో అజిత్. అయితే ఇప్పుడాయన మరో అద్భుత సాహసం చేయబోతున్నట్లు తెలిసింది. ఆయన ఏడాదిన్నర పాటు షూటింగ్లకు విరామం ఇచ్చి.. లాంగెస్ట్ బైక్ రైడ్కు ప్లాన్ చేసినట్లు సమాచారం.. ఇందుకోసం ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తి చేసి ఇంకా మరి సినిమాల్లో ఒప్పుకోకూడదని ఆయన అనుకున్నట్టు తెలుస్తోంది..
ప్రస్తుతం హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మిస్తున్న తుణివు చిత్ర షూటింగ్ను పూర్తి చేశారాయన. బ్యాంక్ రాబరింగ్ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. త్వరలోనే నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన.. మరోసారి బైక్‌పై ప్రపంచాన్ని చుట్టి రావడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఈసారి ఆయన బైక్పై సూధీర్ఘ ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం అందింది. దాదాపు 18 నెలల పాటు.. అంటార్కిటికా సహా ఏడు ఖండాల్లోని దాదాపు 62 దేశాలు చుట్టి రానున్నారని తెలిసింది. ఈ సుధీర్ఘ ప్రయాణం కారణంగా ఆయన షూటింగ్లకు ఏడాదిన్నార పాటు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలాసార్లు బైక్ రైడింగ్ పై తనకున్న ఇష్టాన్ని నిరూపించుకున్న అజిత్ మరోసారి ఈ సాహసం చేయనున్నారు..