Entertainment ప్రస్తుత ఆహలో ప్రసారమవుతున్న బాలకృష్ణ అండ్ స్టాపబుల్ సీజన్ 2 కు పవన్ కళ్యాణ్ రావడం చర్చనీయాంశంగా మారింది.. అయితే కేవలం రాజకీయ కోణంతోనే ఆయన ఈ షో కు వచ్చారంట వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వజ.. అంతేకాకుండా బాలకృష్ణకు ఇలాంటి రాజకీయాలు తెలియవని కేవలం పవన్ కళ్యాణ్ సినిమా కోణంలోనే పిలిచారంటూ చెప్పుకొచ్చారు..
ఆన్ స్టాప్ బుల్ ఒక కామెడీ షో దీన్ని రాజకీయ కోణంలో ఎలా చూస్తారు అంటే చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి.. అలాగే జనాన్ని ఎంటర్‌టైన్ చేసే షో అన్‌స్టాపబుల్. బాలకృష్ణ చిలిపిగా ప్రశ్నలు వేస్తుంటే మనకు ఇంకా మజా వస్తుంది. దాంట్లో రాజకీయం ఇన్‌క్లూడ్ చేయిస్తారు అనుకుంటే మనకన్నా పిచ్చోళ్లు ఎవరుంటారు. నేనైతే దాన్ని అస్సలు నమ్మను.. అలాగే బాలకృష్ణ గ్రహాలు, రాశులు నమ్ముతారు. ఆయన శాస్త్రంతో వెళ్తుంటారు. ప్రతిదానికి ఆయనే ముహూర్తం పెట్టుకుంటారు. ఓపెనింగ్, క్లోజింగ్, సినిమా రిలీజ్ ఇలా అన్నింటికీ రఫ్‌గా ఆయనే ముహూర్తం పెడతారు. అందుకే గ్రహాలు, రాశులు వర్కౌట్ అవ్వక సంక్రాంతికి రిలీజ్ కావాలని ఆయన అడిగి ఉండొచ్చు. చిరంజీవికి ఎప్పుడూ పండగ సీజన్‌లో సినిమాలు వస్తుంటాయి కాబట్టి ఆయన కూడా ఈసారి ఉండాలని అనుకుని ఉంటారు. ఇద్దరూ మాస్ హీరోలు.. ఎప్పుడు రిలీజ్ చేసినా ఆడతాయి.. ప్రొడ్యూసర్‌కి నష్టమేముంది. అంతేతప్ప దానిలో ఇంకేమీ లేదు. ‘వీరసింహారెడ్డి’ మొన్నటిదాకా షూటింగ్ జరుగింది. డిసెంబర్ ఆఖరిలో షూటింగ్ జరిగింది. అలాంటిది ఎలా రిలీజ్ అవుతుంది డిసెంబర్‌లో. కాబట్టి నిజాలు తెలియకుండా మనం మాట్లాడకూడదు.. అంటూ చెప్పకు వచ్చారు..