Entertainment టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సి అయితే ఎప్పుడూ కూడా తనకు ఏమనిపిస్తే అది మాట్లాడుతూ ధైర్యంగా ముందుకు వెళుతుంది తాప్సి ఇప్పటికే ఈ విషయంలో పలు వివాదాలను ఎదుర్కొన్న ఈ భామ వెనక్కి తగ్గేది లేదంటూ మరొకసారి తన మాటలతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది..
తాప్సి తను నటించే కథలు అన్నిటిని కూడా విభిన్నంగానే ఎంచుకుంటూ ఉంటుంది అలాగే తాజాగా ఓ చిత్ర ప్రమోషన్ లో భాగంగా విలేకరులతో మాట్లాడిన ఆమె వారిపై అసహనాన్ని వ్యక్తం చేసింది అయితే ఈ తీరుపై అంతా ఫైర్ అయ్యారు తాప్సికి పొగరు పెరిగింది అంటూ కామెంట్లు చేశారు అయితే ఈ విషయంపై స్పందించిన తాప్సి.. కొంతమంది నటీనటుల మాదిరిగా కెమెరాల ముందు నటించడం తనకు రాదని చెప్పకు వచ్చింది అలాగే ఎప్పుడు స్థానం నిజాయితీగా ఉంటానని అన్నది…
” నాకు నచ్చినట్టు నేను ఉండటం వల్ల చాలామంది నాపై విమర్శలు చేస్తూ ఉంటారు అలాగే సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు అయితే ఇలా చేయడం వల్ల నాకు వచ్చే నష్టం ఏమీ లేదు కొందరి నటీనటులు కెమెరా ముందు నటిస్తూ ఉంటారు వాళ్ళలా నాకు నటించడం రాదు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, నాపై వచ్చే వార్తల గురించి వెతకకూడదని నిర్ణయించుకున్నా. ఎదుటివారి పొగడ్తల కోసం నేను ఆరాటపడను. నాకు నచ్చిన విధంగా ఉంటాను. ఇంటర్వ్యూల్లోనూ నా మనసుకు అనిపించింది మనస్ఫూర్తిగా మాట్లాడతాను. సమాజంలో మంచి మార్కులు కొట్టేయడానికి కొంతమంది స్టార్స్ బయట నటిస్తుంటారు. అలాంటి వారి గురించి నిజాలు బయటకు వచ్చినప్పుడు ప్రజల్లో వారి గౌరవం దెబ్బ తింటుంది. అందరికీ నేను నచ్చాలని లేదు. కాబట్టి, నటిగా నా వర్క్‌ని వాళ్లు మెచ్చుకుంటే చాలు..” అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ