Political ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై.. వైసీపీ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎంపీలను రాష్ట్ర ప్రజలు గెలిపించినప్పటికీ.. వారంతా రాష్ట్ర హక్కులను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టుపెట్టారని తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌తో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
వైసిపి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎంపీలను రాష్ట్ర ప్రజలు గెలిపించినప్పటికీ.. వారంతా రాష్ట్ర హక్కులను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టుపెట్టారని అన్నారు.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు తదితర అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తామన్నారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన వైసీపీ ఎంపీలు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు.. ఈ విషయాలన్నీ డిసెంబర్ ఏడు నుంచి మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తప్పకుండా చర్చించాలన్నారు.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఏం చేసిందో చెప్పాలని అన్నారు రాజధానిని ఏమాత్రం అభివృద్ధి పరచకుండా తిరిగి కేంద్రం దగ్గర రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టి అధికారం ఎవరు ఇచ్చారు అంటూ ప్రశ్నించారు.. ఇవన్నీ తొందరలోనే తెలుసుకోబోతున్నాం అంటూ అన్నారు