ఆడు మగాడ్రా బుజ్జీ
ఇదేదో సినిమా డైలాగ్ అనుకుంటున్నారా? అవును నిజమే కానీ ఈ డైలాగును తీన్మార్ మల్లన్న ( చింతపండు నవీన్ కుమార్ ) గురించి ఇప్పుడు రాజకీయాలలో వాడవలసి వచ్చింది. నల్గొండ జిల్లాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సాధారణ మనిషి. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు, ప్రస్తుతం 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు, అతడికి ఏ రాజకీయ పార్టీ అండదండలు లేవు. అతడికి ఏ యూనియన్ మద్దతు లేదు. సినీ గ్లామర్ లేదు. కోట్ల కొద్దీ ఆస్తులు లేవు. కేవలం జర్నలిజం నమ్ముకుని యూట్యూబ్ ఛానల్ లో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వ్యక్తికి ఇంత ఫాలోయింగా? తప్పు నిర్ణయాలను తుర్పారా పెట్టే ఓ సామాన్యుడికి ఇంత క్రేజా? రాజకీయ పార్టీల అభ్యర్థులు దరిదాపుల్లో లేరు. వంద కోట్ల రూపాయలు కుమ్మరించి గెలవాలని చూస్తున్న అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్న మల్లన్న నిజంగా ఓ రాజకీయ విప్లవం. నిజమే. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఆడు మగాడ్రా బుజ్జీ అంటున్నారు ప్రజలు.